Sudigali Sudheer: జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్‌ అవుట్‌..?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.

Arun Chilukuri
Published on: 14 Nov 2021 1:24 PM IST
Sudigali Sudheer May Quit From Jabardasth Comedy Show Soon
X

Sudigali Sudheer: జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్‌ అవుట్‌..?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే త్వరలోనే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేస్తాడని ప్రచారం జరుగుతుంది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే సడెన్‌గా సుధీర్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో సరిగా తెలియదు కానీ ఇకపై షోలో తను కొనసాగేందుకు అతను ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం క్లారిటీ లేదు.

ప్రస్తుతం హీరోగా సుధీర్‌ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటు షో అటు సినిమా.. రెండు బ్యాలెన్స్ చేయడం కుదరకపోవడంతో తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు సుధీర్ గాని వెళ్లిపోతే కచ్చితంగా అతనితో పాటు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చేస్తారు. అదే జరిగితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం పూర్తిగా మాయమవుతుంది. కచ్చితంగా ఇది టీఆర్పీ రేటింగ్స్‌పై మరింత ప్రభావం చూపించడం ఖాయం. మరి సుధీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మల్లెమాల ప్రొడక్షన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story