Coronavirus: సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది.

Samba Siva Rao
Updated on: 18 May 2021 9:30 AM IST
sudheer grand mother passed Away
X

సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో 

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. క‌రోనా సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ‌రిని వ‌ద‌లిపెట్ట‌డం లేదు. ప్రాణాంత‌క వైర‌స్ వేల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.సినిమా షూటింగ్‌లు కూడా వాయిదా పడుతున్నాయి. ఇటు వరుస మరణాలు షూటింగ్స్ ఆగిపోవడంతో అన్ని సినిమాల ఇండస్ట్రీలు కుదేలవుతున్నాయి. టాలీవుడ్, కొలివుడ్, ద‌ర్శ‌కులు, న‌టులు, ర‌చ‌యిత‌లు ఇలా అనేక మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లి తీసుకుంది. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట్లోనూ విషాదం నింపింది.

కరోనాతో బాధపడుతూ సుడిగాలి సుధీర్ అమ్మమ్మ ఇటీవలే కన్నుమూశారు. ఈ విషయాన్ని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు కూడా దక్కలేదని వెల్లడించారు. ఈటీవీలో ప్రసారం కావాల్సిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో యూట్యూబ్‌లో విడుదలయింది. ఈ వీడియో రాంప్రసాద్ క‌రోనా అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే.. సుధీర్ అమ్మమ్మ మరణించారని రాంప్రసాద్ చెప్పాడు. ఈ విషయాన్ని రామ్ ప్ర‌సాద్ చెబుతుంటే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story