Sudigali Sudheer: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్ ప్రోమో!

Sudigali Sudheer: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్ ప్రోమో!
x
Highlights

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గా టీవీ ప్రేక్షకుల మనసులు దోచిన సుధీర్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గా టీవీ ప్రేక్షకుల మనసులు దోచిన సుధీర్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. తెలుగు బుల్లితెరపై మెరిసి మురిపిస్తున్న తారలు ఎందరో ఉన్నారు. వెండితెర మీద వెలిగిపోవాలని కృష్ణానగర్ చేరిన ఔత్సాహికులకు కొంతవరకూ ఆ కోరికను తీర్చింది బుల్లితెర. కాలే కడుపుతో తమకున్న కళపై ఉన్న నమ్మకంతో కష్టాలు పడుతూనే అవకాశాల కోసం ఎదురుచూసే ఎందరినో కడుపున పెట్టుకుంది టీవీ పరిశ్రమ. అక్కడ తమ టాలెంట్ తో పైకెదిగిన చాలా మంది ఈరోజు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఒక్క పూట తిండి కోసం తిప్పలు పడిన సుధీర్..సుడిగాలిలా టీవీ తెరను తన ప్రతిభతో ఏలేస్తున్నాడు ఇప్పుడు.

కామెడీ తో జబర్దస్త్ లో అలరిస్తూనే.. 'ఢీ' షో లో అప్పుడప్పుడు తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఒర్రూతలూగిస్తున్నాడు. అంతేకాదు తన మేజిక్ తో ప్రత్యెక ఈవెంట్లలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రాం వేలాది మంది చూడటం సహజం.. ఆ ప్రోగ్రాం బావుందంటే లక్షల్లో దానిని చూసి ఆనందించడం యూట్యూబులో లైకులు దంచి కొట్టడం కామన్. కానీ, ఒక చిన్న ప్రోమో లక్షలాదిమందిని ఆకట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఘనత సాధించాడు ఇప్పుడు సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ఢీ చాంపియన్స్ లో సుధీర్ పై చేసిన ఒక పాటకు సంబంధించిన ప్రోమో యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. సంచలనం అంటే మామూలుగా కాదు..

ఈటీవీలో ప్రసారం అయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ డాన్స్ షో "ఢీ ఛాంపియన్స్" కు చెందిన లేటెస్ట్ ప్రోమో ఇప్పటి వరకు ఏ స్మాల్ స్క్రీన్ ప్రోగ్రాం ప్రోమోను తెచ్చుకోని స్థాయి రెస్పాన్స్ ను యూట్యూబ్ లో రాబట్టింది. చిన్నతెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ పై ప్లాన్ చేసిన ప్రత్యేక సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేసేస్తోంది.



సుధీర్ జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్లాన్ చేసిన సాంగ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవడంతో కేవలం ఒకటిన్నర రోజులోనే 5.3 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడమే కాకుండా ఊహించని విధంగా 1 లక్ష 98 వేలు లైక్స్ ను రాబట్టింది. ఇది మాత్రం సెన్సేషన్ అనే చెప్పాలి. అంతే కాకుండా ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ 4 స్థానంలో ట్రెండ్ అవుతుంది. మొత్తమ్మీద ఒక ప్రోమో యూట్యూబ్ ను షేక్ చేయడం అది కూడా సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ప్రోమో కావడం సుధీర్ కష్టానికి దక్కిన ఫలితంగా భావించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories