సుడిగాలి సుధీర్ తో పులిహోర కలిపిస్తున్న సుమక్క!

సుడిగాలి సుధీర్ తో పులిహోర కలిపిస్తున్న సుమక్క!
x

Eat with Sumakka dasara special with sudigali sudheer (images sumakka promo)

Highlights

బుల్లితెర మీద సుమ యాంకరింగ్ కి అందరూ ఫిదా అయిపోతారు. ఇక సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్ కి అందరూ ఫ్లాట్ అయిపోతారు. మరి ఆ ఇద్దరూ కలిసి ఓ స్పెషల్ షో చేస్తే.. అదిరిపోతుంది అనడం లో సందేహం లేదు.

మాటల మూట ఒకరు.. ఒదిగి ఉండే టాలెంట్ మరొకరు.. మరి వాళ్ళిద్దరూ ఓ దగ్గర కలిస్తే..అబ్బబ్బ ఆ సందడి చెప్పక్కర్లేదు. ఇంతకీ ఎవరో అర్ధం అయిందా.. అయినా చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాం. మాటల మూట 'సుమ' అయితే, ఒదిగి ఉండే టాలెంట్ 'సుధీర్'. మీరు కూడా వాళ్ళే అనుకున్నారు కదూ. మాకు తెలుసులెండి. ఇక విషయం ఏమిటంటే.. సుమక్క ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఇదీ మీకు తెలిసిందే. మరి కొత్త విషయం ఏమిటంటే ఆ ఛానెల్ లో 'ఈట్ టాక్ విత్ సుమక్క' అని ప్రత్యెక కార్యక్రమాన్ని వండి యూట్యూబ్ ప్రేక్షకుల కోసం వడ్డిస్తోంది సుమక్క. దానికి సెలబ్రిటీలను తీసుకు వచ్చి కొంచెం మసాలా ఘాటు తగిలిస్తోంది. అదిగో ఈసారి దసరా సందర్భంగా మసాలా ఘాటుకు బదులు మంచి పుల్ల పుల్లని నిమ్మకాయ వచ్చింది సుమక్క షో కి. అతడే సుధీర్. మరి మామూలుగానే సుమక్క మాటలు మురిపించేస్తాయి. మరి సుధీర్ లాంటి వాడు దొరికితే వాటికి మరింత సంబరం. విపరీతంగా విరిచి విరిచి విరగబడిపోతాయి . అదే జరిగినట్టుంది. ఆ షో ప్రోమో విడుదలైంది అందులో చూస్తుంటే సుధీర్ తో మంచి పులిహోర కలిపించేసినట్టుంది సుమక్క. పులిహోర అంటే వేరే అర్ధం చేసుకోకండి.. ఇది తనే పులిహోరే!

ఇక ఈ ప్రోమోలో సుమ డైలాగులు అదిరిపోయాయి. వాళ్ళందరూ చెబుతారు ఏది చెప్పండమ్మా అని సుమ అడగ్గానే..పులిహోర అని వాయిస్ ఓవర్ వినిపించింది. దానికి సుధీర్..పులిహోర.. ఏంటి మేడం మీరు అని అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈరోజు మనము సుధీర్.. పులిహోర తయారు చేసే విధానం తెలుసుకుందాం అని సుమ అమ్మ స్టైల్ కి సుధీర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఇక స్టవ్ వెలిగించిన సుధీర్ మేడం ఇది వెలిగిందా మేడం అని అడిగాడు. దానికి సుధీర్ ఆ వెలిగింది అనగానే.. పోగారాకపోతేను అన్నాడు సుధీర్. దానికి సుమ మామూలుగా నువ్వు వెలిగించే దానికి పొగ నువ్వే పెడతావు కదా అని సుమ తనదైన స్టైల్ లో లుక్కు ఇచ్చింది.

ఇలా ఒక నిమిషం నలభై సెకన్ల ప్రోమోలోనే సుమ డైలాగుల పంచులు.. సుధీర్ అమాయకపు లుక్స్ కలగలిపి ప్రేక్షకుల్ని కట్టి పాదేశాయి. అందుకే ఈ ప్రోమో వీడియో యుట్యూబ్ లో సూపర్ ట్రేండింగ్ లో ఉంది. జస్ట్ ప్రోమో ఇంత హంగామా చేస్తుంటే.. అసలు షో ఎంతగా ప్రేక్షకుల మనసులు కొల్లగోట్టేస్తుందో అనిపిస్తుంది.

మరి మీరూ ఈ ప్రోమో చూసేయండి..హాయిగా నవ్వేసుకోండి!


Show Full Article
Print Article
Next Story
More Stories