Sudigali Sudheer: జబర్ధస్త్‌లోకి సుధీర్ రీఎంట్రీ.. ఆ సమస్య వల్లే షోకు దూరం..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.

Arun Chilukuri
Published on: 6 Nov 2022 3:47 PM IST
Sudigali Sudheer About Jabardasth Re Entry
X

Sudigali Sudheer: జబర్ధస్త్‌లోకి సుధీర్ రీఎంట్రీ.. ఆ సమస్య వల్లే షోకు దూరం..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. జబర్దస్త్ షో తో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గతంలో సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మీ కి మధ్య జరిగిన ప్రేమాయణం తో ఈ జంట తెగ పాపులర్ అయింది. దీంతో సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది ఒకవైపు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

అయితే కమెడియన్ గా కాకుండా ఏకంగా హీరోగా కూడా సినిమాలు తీస్తున్నాడు సుడిగాలి సుధీర్. అయితే కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ షోలో కనిపించడం లేదని అందరికీ తెలిసిందే. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోవటంపై ఇప్పటికే చాలా పుకార్లు నెట్టింట్లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పుకార్లు అన్నిటికి చెక్ పెట్టాడు సుడిగాలి సుధీర్.

మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటని అడగగా వెంటనే జబర్దస్త్ షో అన్నాడు సుధీర్. 2013 ఫిబ్రవరి 7న తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని అన్నారు. మరి ఎందుకు షో ను వదిలేశారు అని అడగగా తను షో వదిలేయలేదని, మళ్లీ వెళ్ళనున్నట్లు తెలిపాడు. "జబర్దస్త్ షోను నేను వదిల్లేయలేదు. కేవలం ఒక 6 నెలలు బ్రేక్ తీసకున్నాను. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల నేను ఈ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. త్వరలోనే మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇస్తాను," అని చెప్పుకొచ్చారు సుధీర్. దీంతో అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story