Sudheer Babu: నాలుగు రోజుల్లో నాలుగు ఫైట్స్..

Sudheer Babu: నాలుగు రోజుల్లో నాలుగు ఫైట్ సన్నివేశాలు పూర్తి చేసిన సుధీర్ బాబు

Jyothi
Updated on: 25 Jan 2023 9:30 PM IST
Sudheer Babu Talks About the Action Scenes of Hunt
X

Sudheer Babu: "హంట్" యాక్షన్ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతున్న సుధీర్ బాబు

Sudheer Babu: సుధీర్ బాబు సినిమాలలో ఫైట్ సన్నివేశాలు ఎప్పుడూ హైలైట్ అవుతూ ఉంటాయి. దానికి కారణం సుదీర్ బాబు యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ చూపించటం. తన సినిమాలలో సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ కు పెద్ద పీట వేస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "హంట్" సినిమాలో కూడా ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకా సినిమా విడుదల కాక పోయినప్పటికీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు మేకింగ్ వీడియోలు విడుదలయ్యాయి.

అందులో ఎక్కువగా ఫైట్స్ అన్ని దేశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. మామూలుగా ఒక్కొక్క ఫైట్స్ సన్నివేశం చిత్రీకరణకి కనీసం ఐదు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది కానీ సినిమాలో ఉన్న నాలుగు ఫైట్లను సుధీర్ బాబు నాలుగు రోజుల్లో పూర్తి చేసేసారట. తాజాగా ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తన అనుభవాలను పంచుకున్నాడు సుధీర్ బాబు. స్టంట్ మాస్టర్లు ఫారెన్ వాళ్ళని వాళ్లతో ఫైట్లు తీయడం అంత ఈజీ కాదని అన్న సుధీర్ బాబు తను ఎప్పటినుంచో వాళ్లను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చారు.

ఇక "జాన్ విక్ 4" కి వర్క్ చేస్తున్నారని తెలుసుకుని కాంటాక్ట్ అవ్వగా వారి మధ్య ముందు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వచ్చిందన్నారు సుధీర్ బాబు. మొదట 12 రోజులు షూటింగ్ అనుకున్నారు కానీ రెండు రోజులు రిహార్సిల్స్ చేసి నాలుగు రోజుల్లో ఫైట్స్ షూట్ అంతా కంప్లీట్ చేశామన్నారు సుధీర్. ఎవరికి చూపించినా నాలుగు రోజుల్లో తీశామంటే నమ్మరని, 4 ఫైట్ సీన్స్ అంత బాగా వచ్చాయన్నాడు సుధీర్ బాబు. ఇక సినిమా లో యాక్షన్ కంటే ఎమోషన్లు కూడా ఎక్కువ హైలైట్ అవుతాయని, సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉందని అన్నారు.

Jyothi

Jyothi

Next Story