Sudheer Babu: అలాంటి సినిమాలు ఆడకూడదు అంటున్న సుధీర్ బాబు

Sudheer Babu: ఆ సినిమాలు హిట్ అవ్వడం కరెక్ట్ కాదు అంటున్న సుధీర్ బాబు

Dhatripriya
Published on: 17 Jan 2023 12:37 PM IST
Sudheer Babu Says that Such films Should not be Played
X

Sudheer Babu: అలాంటి సినిమాలు ఆడకూడదు అంటున్న సుధీర్ బాబు

Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చి హీరోగా మారిన సుధీర్ బాబు "ప్రేమ కథా చిత్రం", "భలే మంచి రోజు", "శమంతకమని","నన్ను దోచుకుందువటే", "సమ్మోహనం" వంటి మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మధ్యనే కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సుదీర్ బాబు ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్ బాబు ప్రస్తుతం వస్తున్న సినిమాల గురించి చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. "ఈమధ్య కాలంలో కొన్ని సినిమాలు చూస్తున్నాను. ప్రతి రెండు నిమిషాలకి ఒక డైలాగ్ పెట్టామా ఆ తరువాత ఒక కామెడీ సీన్ పెట్టామా నెక్స్ట్ సాంగ్ వేసామా అన్నట్టు ఉంటున్నాయి నాకు ఆ సినిమాల పేర్లు చెప్పాలని లేదు కానీ ఆ సినిమాలు థియేటర్లలో బాగా ఆడాయి. కానీ ఒక ఫిలిం మేకర్ గా నేను ఆ సినిమాలతో సాటిస్ఫై అవ్వలేదు.

అలాంటి సినిమాలు ఆడటం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్," అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా సుధీర్ బాబు "హంట్" మరియు "మామా మశ్చేంద్ర" వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story