రణబీర్ కపూర్ సినిమా ని రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు

Sudheer Babu rejects Ranbir Kapoor movie
x

రణబీర్ కపూర్ సినిమా ని రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు

Highlights

Sudheer Babu: తెలుగులో ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు, సమ్మోహనం, వి వంటి సినిమాలలో నటించిన సుధీర్ బాబు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

Sudheer Babu: తెలుగులో ప్రేమ కథ చిత్రం, భలే మంచి రోజు, సమ్మోహనం, వి వంటి సినిమాలలో నటించిన సుధీర్ బాబు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. 2016లో "భాగీ" సినిమాలో విలన్ పాత్ర ద్వారా బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు సుధీర్ బాబు. ఆ సినిమాలో తన నటనకు మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా సుధీర్ బాబుకి హిందీ లో ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ సుధీర్ బాబు ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమా రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న "బ్రహ్మాస్త్ర". నాగార్జున కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కి మెయిన్ విలన్ పాత్ర లభించిందట.

Show Full Article
Print Article
Next Story
More Stories