Sudheer Babu: ప్రభాస్ ఇంటికి వెళ్తే తన మంచితనం, మర్యాదతో చంపేస్తాడు

admin1
Updated on: 24 Aug 2021 3:45 PM IST
Sudheer Babu: ప్రభాస్ ఇంటికి వెళ్తే తన మంచితనం, మర్యాదతో చంపేస్తాడు
X

Prabhas - Sudheer Babu: "ప్రేమ కథ చిత్రం" వంటి మంచి హిట్ సినిమాలలో ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు తాజాగా "శ్రీదేవి సోడా సెంటర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "పలాస 1978" ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. టీజర్ మరియు ట్రైలర్ తోనే అలరించి ఒక విభిన్నమైన ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు "స్టార్ హీరోలు అందరూ చాలా కష్టపడుతూ జిమ్లో వర్కౌట్లు చేస్తూ బాడీ ని మెయింటేన్ చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ప్రభాస్ ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా మాయమైపోతాయి. వారంలో ఒకసారి ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తింటే చాలు ఈ ఫిట్ నెస్ లు ఏమీ ఉండవు. ప్రభాస్ తన మంచితనం, మర్యాదతో చంపేస్తూ ఉంటాడు," అంటూ నవ్వేశారు సుధీర్ బాబు. 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో సుధీర్ బాబు ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

admin1

admin1

Next Story