Sridevi Soda Center: హై ఓల్టేజ్ లుక్‌లో సుధీర్ బాబు

HBD Sudheer Babu: ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.

Venkata Chari
Published on: 11 May 2021 3:22 PM IST
Sudheer Babu New Movie Sridevi Soda Center First Glimpse Released
X

సుధీర్ బాబు (ఫొటో యూట్యూబ్)

Sridevi Soda Center: ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు. ఈ ఏడాది రిలీజైన 'V' సినిమాలో హీరో నానితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తాజాగా మరో ఢిపరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేడు(మే 11) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ మేరకు ట్విట్టర్లో సుధీర్ బాబు ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆ వీడియోకు ''మరి అక్కడుంది లైటింగ్ సూరి బాబు కదా.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది'' అని టెక్ట్ యాడ్ చేశారు. ఈ పోస్టర్ లో సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకుంటున్నాడు సుధీర్ బాబు.

ఈ సినిమాకు కరుణ కుమార్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈయన పలాస 1978 సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను కూడా ఢిపరెంట్ కాన్సెప్ట్ తో తీసి మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అంటున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం. 4గా రానుంది. ఈ సినిమాను విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీతం మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ అందిస్తున్నారు. చిత్రంలో లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో హీరో సుధీర్ బాబు నటించనున్నారు. రిలీజ్ ఎప్పుడనేది తెలియరాలేదు.


Venkata Chari

Venkata Chari

Next Story