'v' సినిమాకి ముందుగా అనుకున్న హీరోలు ఎవరో తెలుసా?

v సినిమాకి ముందుగా అనుకున్న హీరోలు ఎవరో తెలుసా?
x
Sudheer Babu (File Photo)
Highlights

విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ' v'.

విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ' v'.. యంగ్ హీరోలు నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.. ఇందులో అదితీరావ్ , నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం భావం వలన వాయిదా పడింది.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆలీతో జాలీగా అనే ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పుకొచ్చారు.. ముందుగా ఈ సినిమా కోసం హీరోలుగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ని మొదటి ఛాయిస్ గా అనుకున్నారట! ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబు వెల్లడించడం విశేషం... అయితే సినిమా ప్రమోషన్ కోసమే అలా చెప్పాడా? లేక ఇంద్రగంటి నిజంగానే అలా అనుకున్నాడు అనే దానిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడక తప్పదు..

ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్ , ట్రైలర్, సాంగ్స్ సినిమా పైన మంచి అంచనాలు పెంచింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల వాయిదా పడ్డ ఈ సినిమా త్వరలోనే విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories