Prabhas New Movie: మహిళా డైరెక్టర్ తో జతకట్టనున్న ప్రభాస్?

Prabhas New Movie: పరిశ్రమలో ప్రముఖ మహిళా దర్శకులలో సుధ కొంగర నిస్సందేహంగా ఒకరు.

Venkata Chari
Published on: 8 May 2021 5:06 PM IST
Sudha Kongara is currently ready to do a film with young rebel star Prabhas
X
ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Prabhas New Movie: పరిశ్రమలో ప్రముఖ మహిళా దర్శకులలో సుధ కొంగర నిస్సందేహంగా ఒకరు. ఇటీవలే సూర్య నటించిన 'ఆకాశం నీహద్దురా' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

తాజా నివేదికల ప్రకారం, సుధ కొంగర ప్రస్తుతం యువ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తాజా సంచలనం మేరకు, సుధ ఇటీవల ప్రభాస్‌తో సమావేశమై ఒక సోషల్ డ్రామా స్క్రిప్ట్‌ను వివరించారని టాక్ వినిపిస్తోంది. ఈమేరకు ప్రభాస్ కూడా స్క్రిప్ట్‌ను ఇష్టపడ్డాడని, ఫైనల్ డ్రాఫ్ట్ తీసుకురావాలని డైరెక్టర్‌ను కోరినట్లు సమాచారం.

సుధ కొంగర రాసిన ఫైనల్ స్క్రిప్ట్ విన్న తరువాతే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేయనున్నడని తెలుస్తోంది. ఇదే జరిగితే.. మహిళా దర్శకురాలి డైరెక్షన్‌లో ప్రభాస్ తన తొలి సినిమాను చేయనున్నారు.

మరోవైపు, ప్రభాస్ తన రాబోయే చిత్రం 'రాధే శ్యామ్' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్‌తో కలిసి మరో సినిమాను చేయనున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story