Nani: బాగా నమ్మకం ఉన్న సినిమా కి మంచి కలెక్షన్లు రాలేదు

Success Is Not In Our Hands Says Nani
x

Nani: "సక్సెస్ మన చేతిలో ఉండదు," 

Highlights

Nani: "బాగా నమ్మకం ఉన్న సినిమా కి మంచి కలెక్షన్లు రాలేదు,"

Nani: ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "దసరా" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించకపోతున్నారు. శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని ఇంతకుముందు ఎప్పుడూ కనిపించినటువంటి ఒక ఊర మాస్ లుక్ తో అదరగొట్టనున్నారు. తెలంగాణలోని గోదావరిఖని దగ్గర బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

భారీ అంచనాల మధ్య ఈనెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ సక్సెస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాని. "విడుదలకు ముందు నేను ఒక సినిమా విషయంలో చాలా సంతోషంగా మరియు కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ ఆ సినిమాకి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు రాలేదు. మరొక సినిమా విషయంలో నేను యావరేజ్ గా ఆడుతుందేమో అనుకున్నాను కానీ ఆ సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్లు చాలా ఎక్కువ వచ్చాయి. కాబట్టి సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు. అలా మన చేతిలో లేనిది అన్ని వాటంతటవే జరిగిపోతాయి. మన చేతిలో ఉండేది కేవలం మన హార్డ్ వర్క్ మాత్రమే," అని అన్నారు నాని.

చూస్తూ ఉంటే నాని కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ అందుకోలేక పోయినా సినిమా అని జెర్సీ గురించి చెప్పినట్లు కొందరు చెబుతున్నారు. ఇక బాగా ఆడదు అనుకున్నా సినిమా మంచి కలెక్షన్లు తెచ్చింది అని మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) సినిమా గురించి చెప్పి ఉంటారు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories