Allu Arjun: ఖరీదైన విలాసవంతమైన కార్ల తో స్టైలిష్ స్టార్

Allu Arjun: ఖరీదైన విలాసవంతమైన కార్ల తో స్టైలిష్ స్టార్

admin1
Updated on: 23 Feb 2022 8:00 AM IST
Stylish Star Allu Arjun with Expensive luxury Cars | Tollywood News
X

Allu Arjun: ఖరీదైన విలాసవంతమైన కార్ల తో స్టైలిష్ స్టార్

Allu Arjun: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో అల్లుఅర్జున్ కూడా ఒకరు. స్టైలిష్ స్టార్ గా పిలవబడే బన్నీ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక వైపు తెలుగులో మాత్రమే కాక మరో వైపు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా అల్లు అర్జున్ సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఎప్పుడు షూటింగ్ నుండి ఖాళీ దొరికినా తన కుటుంబ సభ్యులతో పిల్లలతో సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. దాదాపు ప్రతి ఈవెంట్ కి తన కుటుంబంతోనే వస్తాడు బన్నీ. అయితే తాజాగా "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు ఒక విలాసవంతమైన ఇల్లు కట్టించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

స్టైల్ ఉండే అల్లు అర్జున్ కి తనకంటూ ఒక స్పెషల్ వ్యానిటీ వ్యాన్ ఉంది. దీని ధర ఏకంగా ఏడు కోట్లు ఉండచ్చు. ఇందులో ఒక పెద్ద టీవీ సెట్, ఫ్రిడ్జ్, రిక్లైనర్ కూడా ఉన్నాయి. దానికి "ఫాల్కన్" అనే ఒక పేరు పెట్టి "ఏ ఏ" అంటూ సైన్ కూడా పెట్టాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ ఇల్లు కూడా చాలా విలాసవంతంగా నే ఉంటుంది. దాదాపు రెండు ఎకరాల స్థలంలో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 కోట్లు పెట్టి అల్లు అర్జున్ తన ఇంటిని నిర్మించుకున్నారు. అందులోనే హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ప్లే ఏరియా ఇలాంటి ఎన్నో వసతులు ఉన్నాయి. ఇక అల్లుఅర్జున్ ఇష్టంగా కొనుక్కున్న ఖరీదైన కారు రేంజ్ రోవర్ వోగ్. దీని ధర 75 లక్షల నుంచి కోటి వరకు ఉండొచ్చు. అలాగే అల్లు అర్జున్ తన తొలి సంపాదన తో హమ్మర్ హెచ్ టు కొన్నారు. దాని ధర కూడా 75 లక్షలు దాకా ఉంటుంది. ఇక అల్లు అర్జున్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ కార్ ధర 31 లక్షలు.

admin1

admin1

Next Story