Allu Arjun: శ్రీ చైతన్య విద్య సంస్థలని ప్రమోట్ చేస్తున్న స్టైలిష్ స్టార్

* "తగ్గేదే లే" అంటున్న శ్రీ చైతన్య విద్య సంస్థలు

admin1
Updated on: 16 Oct 2021 1:30 PM IST
Stylish Star Allu Arjun Promoting Sri Chaitanya Educational Institutions
X

 శ్రీ చైతన్య విద్య సంస్థని ప్రమోట్ చేస్తున్న స్టైలిష్ స్టార్(ఫైల్ ఫోటో)

Allu Arjun: టాలీవుడ్ లోని స్టార్ హీరో లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో బన్నీ కూడా ఒకరు. యూత్ లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బన్నీ అటు సినిమాలతో మాత్రమే కాక ఇటు బ్రాండ్ ఎండార్స్మెంట్ లతో సైతం బిజీ ఇపోయారు. అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ముందు క్యూ కడుతున్న తరుణంలో శ్రీ చైతన్య విద్య సంస్థలు అల్లు అర్జున్ మీద కాకుండా 'పుష్ప'రాజ్ మీద కన్నేశారు. అదేనండి బన్నీ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమాలో బన్నీ పేరు అది.

తెలుగు రాష్ట్రాలలో పుష్ప రాజ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ తయారయ్యింది. ఈ నేపథ్యంలోనే ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి సిద్ధమయ్యాడు బన్నీ. 1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ మారారు బన్నీ. దీనికి సంబంధించిన యాడ్ ను విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న శ్రీచైతన్య వారు నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ "ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య" అని చెప్పడంతో పాటు "మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రమ్ తగ్గేదే లే" అంటూ డైలాగ్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

admin1

admin1

Next Story