Tollywood: టాలీవుడ్‌లో నిలిచిపోయిన షూటింగ్స్

Tollywood: కాసేపట్లో తలసానితో భేటీకానున్న సినీ కార్మికులు

Rama Rao
Updated on: 23 Jun 2022 10:30 AM IST
Stopped Shootings in Tollywood | Tollywood News
X

Tollywood: టాలీవుడ్‌లో నిలిచిపోయిన షూటింగ్స్

Tollywood: సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రస్తుతం 28 సినిమాల షూటింగ్‌లు జరుగుతుండగా, ఈ సమ్మె కారణంగా వాటి చిత్రీకరణ ఆగిపోయింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఇవాళ్టి నుంచి యధావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలని కార్మికులను కోరింది. లేకపోతే ఆరు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నిర్మాతలెవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దని సూచించింది.

మరోవైపు ఫెడరేషన్ సభ్యులు కూడా వెనక్కు తగ్గట్లేదు. వేతనాలు పెంచేంత వరకు షూటింగ్‌లకు హాజరు కాలేమంటూ తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కంటే 45 శాతం ఎక్కువ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే.. నష్టపోయేది నిర్మాతలేనని అంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story