Omicron Variant: నిర్మాతలకి నిద్రలేకుండా చేస్తున్న కరోన కొత్త వేరియంట్

మళ్లీ ఇబ్బందులపాలు కాబోతున్న స్టార్ హీరో సినిమాల నిర్మాతలు

Sandeep Reddy
Published on: 5 Dec 2021 10:52 AM IST
Star Producers Tension of Movie Releases with Omicron Variant
X

నిర్మాతలకి నిద్రలేకుండా చేస్తున్న కరోన కొత్త వేరియంట్ 

Omicron Variant: థియేటర్లన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అన్న ఆనందంలో సినిమా లవర్స్ కి ఎక్కువ కాలం నిలిచేలా లేదు. కొత్తగా వచ్చిన కరొన వేరియంట్ ఇప్పుడు మళ్లీ పాత పరిస్థితులను తీసుకు వచ్చే లాగా కనిపిస్తోంది. ఆఖరికి స్టార్ హీరోల సినిమాలు మళ్లీ వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలీక నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంతకు ముందు వరకు వేరే దేశాల్లో ప్రీమియర్ ల వల్ల వచ్చే కలెక్షన్లు ఎక్కువగా ఉండేవి. కానీ వరుసగా ఐదవ రోజు అమెరికాలో లక్ష కి పైగా కేసులు నమోదు కావడంతో అందరిలోను భయం మొదలైంది.

పెరిగే కేసులను చూస్తుంటే టాలీవుడ్ మళ్లీ ఇబ్బందులపాలు అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్యనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ థియేటర్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయే లాగానే అనిపిస్తోంది. మరి ఈ సమయంలో స్టార్ హీరో సినిమాల నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంకా తెలియాల్సి ఉంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story