రామ్ చరణ్ కోసం సంగీతాన్ని అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

*మళ్లీ అదే మ్యూజిషియన్ ను రంగంలోకి దింపిన బుచ్చిబాబు

Jyothi
Published on: 30 Nov 2022 7:55 AM IST
Star Music Director Will Provide the Music To Ram Charan
X

రామ్ చరణ్ కోసం సంగీతాన్ని అందించనున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఆర్సీ15 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు సన డైరెక్టర్ గా తన మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి హిట్ ను అందుకున్నారు. సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

"ఉప్పెన" సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అందుకే రామ్ చరణ్ తో సినిమా కోసం కూడా బుచ్చిబాబు దేవి శ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇవాళ ఈ సినిమాని ఒక పూజా ఈవెంట్ తో అధికారికంగా లాంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ వచ్చే ఏడాది జనవరిలో మొదలు కాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందు రామ్ చరణ్ శంకర్ తో సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పొలిటికల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అంజలి, జయరాం, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story