మూడు బడా తెలుగు సినిమాలు లైన్ లో పెట్టిన అనిరుధ్ రవిచందర్...

Anirudh Ravichander: కోలీవుడ్లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ కూడా ఒకరు...

admin1
Published on: 17 March 2022 10:25 AM IST
Star Music Director Anirudh Ravichander Signed 3 Big Movies in Telugu | Live News
X

మూడు బడా తెలుగు సినిమాలు లైన్ లో పెట్టిన అనిరుధ్ రవిచందర్...

Anirudh Ravichander: కోలీవుడ్లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ కూడా ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు చార్ట్ బస్టర్ పాటలను అందించిన అనిరుధ్ రవిచందర్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అజ్ఞాతవాసి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాలో పాటలతో అంతగా మెప్పించలేకపోయిన అనిరుధ్ రవిచందర్ "గ్యాంగ్ లీడర్" సినిమాతో పర్వాలేదు అనిపించాడు.

"జెర్సీ" సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అనిరుధ్ రవిచందర్ తాజాగా ఇప్పుడు 3 పెద్ద తెలుగు సినిమాలకు సైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న "ఎన్టీఆర్30" సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ మరియు సమంత హీరోహీరోయిన్లుగా "మజిలీ" ఫేమ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక మరో వైపు రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా చేయనున్నారు అనిరుధ్. "జెర్సీ" సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం రెండవసారి రంగంలోకి దిగుతున్నారు అనిరుధ్.

admin1

admin1

Next Story