నాని30 సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న హీరోయిన్

Nani: నాని సినిమాలో కీలక పాత్ర పోషించనున్న స్టార్ హీరోయిన్

Dhatripriya
Updated on: 30 April 2023 9:15 AM IST
Star Heroine Will Play Key Role In The Nani Movie
X

నాని30 సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న హీరోయిన్

Nani 30: ఈమధ్యనే శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో "దసరా" అనే సినిమాతో నాచురల్ స్టార్ నాని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత నాని కరియర్ లోనే ఈ సినిమా ఒక సూపర్ హిట్ ని అందించింది. ప్రస్తుతం నాని తన కరియర్లో 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. #నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాతో షౌర్యువ్ అని మరొక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

వైరా ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాని మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతుంది. సినిమా షూటింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసే సినిమాని కూడా త్వరగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. "సీతా రామం" సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు శృతిహాసన్. ఈ మధ్యనే "వాల్తేరు వీరయ్య" , "వీర సింహా రెడ్డి" సినిమాలతో మంచి విజయాలు అందుకున్న శృతిహాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో శృతిహాసన్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి హేశం అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story