Kajal Aggarwal: త్వరలో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..!?

* లాక్ డౌన్ లో చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న యాక్టర్ల లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.

admin1
Updated on: 15 Sept 2021 2:33 PM IST
Star Heroine Kajal Aggarwal is Going to be Mother Soon
X

కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లూ (ట్విట్టర్ ఫోటో)

Kajal Aggarwal: లాక్ డౌన్ లో చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న యాక్టర్ల లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతున్న కాజల్ అగర్వాల్ గతేడాది ప్రముఖ బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమ వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా వరుసగా ప్రాజెక్టులతో బిజీ గా ఉన్న కాజల్ అగర్వాల్ త్వరలో తల్లికాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న "ది గోస్ట్" సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్న కాజల్ అగర్వాల్ మరియు గౌతమ్ కిచ్లూ త్వరలోనే తల్లిదండ్రులు అవ్వబోతున్నారు అంటూ ఒక బాలీవుడ్ వెబ్ సైట్ ప్రచురించడంతో అభిమానులు ఖంగుతిన్నారు.

అయితే ఈ విషయంపై కాజల్ కూడా ఏ విధంగానూ స్పందించకపోవడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. అయితే స్టార్ హీరోయిన్ కి పెళ్లి అయితే ఇలాంటి పుకార్లు రావటం సహజమే. పెళ్లయిన కొత్తలో సమంత విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ కాజల్ మాత్రం ఈ పుకార్లపై స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే మరో వైపు కాజల్ అగర్వాల్ కొత్త ప్రాజెక్టులను కూడా చేయకపోవడం అభిమానులకు అనుమానాస్పదంగా మారింది. మరో వైపు కాజల్ హీరోయిన్ గా నటించిన మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా త్వరలోనే విడుదల కు సిద్ధం అవుతుంది.

admin1

admin1

Next Story