హైదరాబాదులో షూటింగ్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోలు

Star Heroes Busy with Shooting in Hyderabad | Tollywood News
x

హైదరాబాదులో షూటింగ్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోలు

Highlights

సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న స్టార్ హీరోలు

Hyderabad: కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమాలు సెట్స్ పైకి మళ్ళీ వెళ్ళి పోయాయి. దాదాపు అందరు స్టార్ హీరోలు తమ సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి ఏ స్టార్ హీరో ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసుకుందాం. కొంతమంది హైదరాబాద్లోనే షూటింగులు చేస్తుండగా మరికొందరు మాత్రం అవుట్డోర్ వెళ్లి మరి షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు బాబీ దర్శకత్వంలో చేస్తున్న "గాడ్ ఫాదర్" సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ముషీరాబాద్ లో జరుగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "ప్రాజెక్ట్ కే" సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. మరోవైపు మెగాపవర్స్టార్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ధమాకా సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే సారధి స్టూడియోలో మొదలుపెట్టారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories