Siva karthikeyan: డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించిన స్టార్ హీరో

* "ప్రిన్స్" డిస్ట్రిబ్యూటర్లకు మూడు కోట్లు ఇచ్చేసిన శివ కార్తికేయన్

Dhatripriya
Published on: 5 Jan 2023 11:49 AM IST
Star Hero Paid Compensation To Distributors
X

Siva karthikeyan: డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించిన స్టార్ హీరో

Siva karthikeyan: ప్రముఖ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఈమధ్యనే "ప్రిన్స్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. "జాతి రత్నాలు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ కె.వి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా గత ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను అందుకోలేకపోయింది. అన్ని ఏరియాస్ లోను ఈ సినిమా తీవ్ర నష్టాలను కలగజేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు శివ కార్తికేయన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. నష్టపరిహారంగా చిత్ర డిస్టర్బ్యూటర్లకు శివ కార్తికేయ అనేకంగా మూడు కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల దాకా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్లకు చేయూతనివ్వడానికి శివ కార్తికేయన్ ముందుకు వచ్చారు. మరోవైపు చిత్ర నిర్మాతరం కూడా డిస్ట్రిబ్యూటర్లకు మూడు కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన సినిమా ఫెయిల్యూర్ ని ఒప్పుకొని మరి శివ కార్తికేయన్ డిస్ట్రిబ్యూటర్ల కు నష్టపరిహారం చెల్లించడం అభిమానుల మనసులను గెలుచుకుంది. తన వ్యక్తిత్వంతో శివ కార్తికేయన్ మరొకమిట్టు పైకి ఎదిగారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముందు శివ కార్తికేయన్ హీరోగా నటించిన "డాన్" మరియు "డాక్టర్" సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్నాయి. ప్రస్తుతం శివ కార్తికేయన్ "మావీరనే" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story