శింబు కోసం నిర్మాతగా మారిన స్టార్ హీరో

* శింబు కోసం నిర్మాతగా మారిన స్టార్ హీరో

Dhatripriya
Updated on: 6 March 2023 7:30 PM IST
Star Hero As Producer For Simbu Movie
X

సీనియర్ హీరో నిర్మాణంలో శింబు హీరో..

Simbu: కొన్నాళ్లు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈమధ్య వరుస సూపర్ హిట్లతో కరియర్ లో ముందుకు దూసుకు వెళుతున్నాడు. "మానాడు", "వెందు తానిందతు కాదు" వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న శింబు ప్రస్తుతం "పత్తు తల" అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కి సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం శింబు ఒక భారీ బడ్జెట్ సినిమాని సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. "కన్నుల్ కన్నుల్ కొల్లాయిదిత్తాల్ (కనులు కనులను దోచాయంటే)" ఫేమ్ డైరెక్టర్ దేసింగ్ పెరియార్ స్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాని లోకనాయకుడు కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శింబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారట. ఇక ఈ సినిమాలో శింబు రెండు విభిన్న పాత్రలలో ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బడ్జెట్ వంద కోట్లు అని సమాచారం. శింబు కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా గా విడుదల కాబోతోంది. శింబు మరియు కమల్ హాసన్ కలిసి పనిచేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ మధ్యనే దేశింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఒక కథ నరేట్ చేశారని రజనీకాంత్ కూడా అది బాగా నచ్చిందని వార్తలు వినిపించాయి కానీ ఆ సినిమా మొదలవలేదు. మరోవైపు రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో "జైలర్" సినిమాని మొదలుపెట్టేశారు. మరి దేసింగ్ రజనీకాంత్ తో అనుకున్న సినిమా కథ ఇప్పుడు శింబు తో చేస్తున్నారా లేక ఇది వేరే కథ అని ఇంకా తెలియాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story