Love Story - Success Meet: "లవ్ స్టోరీ" సక్సెస్ మీట్ కి రాబోతున్న స్టార్ సెలబ్రిటీలు

Love Story - Success Meet: ఇవాళ అనగా 28 సెప్టెంబర్ న హైదరాబాద్లో మాజికల్ సక్సెస్ మీట్ జరగబోతోంది.

admin1
Updated on: 28 Sept 2021 3:03 PM IST
Star Celebrities are Attending Love Story Movie Magical Success Meet Event Today in Hyderabad | Tollywood News
X

"లవ్ స్టోరీ" సక్సెస్ మీట్ కి రాబోతున్న స్టార్ సెలబ్రిటీలు

Love Story - Success Meet: నాగచైతన్య సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "లవ్ స్టోరీ". ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఎంట్రీ ఈ సినిమాకి బాగానే ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాల్లో ఒకటిగా మారింది. ఇక తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ని త్వరలో ప్లాన్ చేస్తోందట.

ఇవాళ అనగా 28 సెప్టెంబర్ న హైదరాబాద్లో మాజికల్ సక్సెస్ మీట్ జరగబోతోంది. తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారు. అందుకనే ఇప్పుడు సక్సెస్ మీట్ కి వచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపనున్నారు. నాగచైతన్య సూపర్ హిట్ సినిమా "హండ్రెడ్ పర్సెంట్ లవ్" కి దర్శకత్వం వహించింది సుకుమార్. అప్పటినుంచి వీరి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే ఈ సక్సెస్ మీట్ కి సుక్కు కూడా విచ్చేయబోతున్నారు. మరోవైపు అమెరికాలో ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టించింది.

admin1

admin1

Next Story