Tollywood: మెగాస్టార్ సినిమా సైన్ చేసిన అనసూయ భరద్వాజ్

Tollywood: మెగాస్టార్ సినిమా సైన్ చేసిన అనసూయ భరద్వాజ్ .

admin1
Updated on: 17 Feb 2022 2:55 PM IST
Star Anchor In Megastar Movie
X

Tollywood: మెగాస్టార్ సినిమాలు నటించనున్న స్టార్ యాంకర్

Tollywood: ఒకవైపు స్టార్ యాంకర్ గా కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్తున్న అనసూయ మరోవైపు స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది అనసూయ. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అనసూయ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "భోళా శంకర్" సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2015లో అజిత్ హీరోగా విడుదలైన తమిళ సినిమా "వేదాళం" కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మెహర్ రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా కనిపించనున్నారు. ఈమధ్యనే రవితేజ హీరోగా నటించిన "ఖిలాడీ" సినిమాలో కనిపించిన గోపీచంద్ "పక్కా కమర్షియల్" సినిమాలో కూడా కనిపించింది. మరి చిరంజీవి సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మహానటి కీర్తిసురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కనిపించనుంది.

admin1

admin1

Next Story