SSMB28: టైటిట్ ఎనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే..?

SSMB28: త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Venkata Chari
Updated on: 11 May 2021 11:01 PM IST
SSMB28 Titled To Be Announced On May 31st
X

మహేశ్ బాబు (ఫొటో ట్విట్టర్)

SSMB28: త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. వీళ్ల కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మూడో సినిమాగా రానున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్‌లో ఉన్నాయి.

'SSMB28' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా టైటిల్‌ను మే 31 న ప్రకటించనున్నారంట. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. పార్దు అనే టైటిల్ పెట్టనున్నట్లు ఇప్పటికే నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రస్తుతం ప్రిన్స్.. 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహానటి హీరోయిన్ కీర్తీ సురేశ్.. మహేశ్ తో రొమాన్స్ చేయనుంది.

మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో మలయాళం సూపర్ హిట్‌ 'అయ్యప్పనుమ్ కోశియమ్' సినిమా రీమేక్‌కు డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించే పనిలో ఉన్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ తో ఈ రెండు చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే త్రివిక్రమ్, ప్రిన్స్ సినిమా లైన్లో‌కి వచ్చే అవకాశం ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story