SS Thaman: మహేష్ బాబు సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన థమన్

SS Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట"...

admin1
Updated on: 7 Jan 2022 3:15 PM IST
SS Thaman Tweet on Mahesh Babu Sarkaru Vaari Paata Movie | Tollywood News
X

SS Thaman: మహేష్ బాబు సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన థమన్

SS Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంత కాలంగా అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్ లు విడుదల చేయమని దర్శక నిర్మాతలను కోరుతున్నారు.

కానీ చిత్రబృందం మాత్రం సినిమాకి సంబంధించిన విషయాలను పెద్దగా పంచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న ఎస్.ఎస్.తమన్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను చేశారు. "మీ మాటలు మేము విన్నాము. మేము వింటూనే ఉన్నాం. త్వరలోనే మీరు మా నుంచి వింటారు. పరశురామ్ గారు మహేష్ బాబు గారితో బెస్ట్ సినిమా చేస్తున్నారు.

మా బృందం మొత్తం ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తున్నాం" అంటూ ట్వీట్ చేశారు థమన్. ఇక ఈ సినిమాలోని పాటలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు జనవరి 13న విడుదల కావాల్సిన "సర్కారు వారి పాట" "ఆర్ ఆర్ ఆర్" బృందం రిక్వెస్ట్ చేయడంతో ఏప్రిల్ కి వాయిదా పడింది. ఏప్రిల్ ఒకటో తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

admin1

admin1

Next Story