ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

SS Thaman to Compose Music for Prabhas Raja Deluxe Movie
x

ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Highlights

SS Thaman: భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధే శ్యామ్ నిన్న అనగా మార్చి 11న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

SS Thaman: భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధే శ్యామ్ నిన్న అనగా మార్చి 11న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక మరోవైపు ప్రభాస్ చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. సలార్, ఆదిపురుష్, మరియు ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా ఇప్పుడు కామెడీ ఎంటర్ టైనర్ల తో మంచి హిట్లు అందుకున్న డైరెక్టర్ మారుతి తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా ఈ సినిమా కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లుగా ఎస్.ఎస్.తమన్ స్వయంగా ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈసారి రూట్ మార్చి రాధేశ్యామ్ అనే ప్రేమకథతో కనిపించారు. అలానే ఇప్పుడు కామెడీ ఎంటర్ టైనర్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories