SS Thaman: "రాధే శ్యామ్" డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న థమన్

SS Thaman: "రాధే శ్యామ్" డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న థమన్

admin1
Published on: 28 Feb 2022 6:35 PM IST
SS Thaman Talks about Director Radha Krishna Kumar | Tollywood News
X

 "రాధే శ్యామ్" డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న థమన్

SS Thaman: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒక ప్రేమ కథ చిత్రం ఇది. ఫాంటసీ ప్రేమకథగా పిరియడ్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా వచ్చేనెల అంటే మార్చ్ 11వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నాయి. తాజాగా ఈ చిత్ర డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ థమన్ చేసిన ఒక ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "ఇతను నన్ను మళ్ళీ ప్రేమలో పడేసాడు. చాలాకాలం తర్వాత నా పొట్ట లో సీతాకోక చిలుకలు ఎగిరినట్టు అనిపించింది. డ్యూడ్ నాకు నేను చాలా కొత్తగా కనిపిస్తున్నాను. సినిమా నా గుండెకు చాలా గట్టిగా తగిలింది," అంటూ రాధా కృష్ణ తో దిగిన ఫోటో ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు థమన్.

admin1

admin1

Next Story