SS Thaman: కాపీరైట్స్ ఇష్యూలో ఇరుక్కున్న ఎస్.ఎస్.తమన్

SS Thaman: తమన్ పై నిప్పులు చెరుగుతున్న జేక్స్ బిజాయ్

admin1
Updated on: 9 Feb 2022 8:00 PM IST
SS Thaman Stuck in Copyright Issue | Tollywood News
X

కాపీరైట్స్ ఇష్యూలో ఇరుక్కున్న ఎస్.ఎస్.తమన్

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సంగీత దర్శకుల్లో ఎస్.ఎస్.తమన్ కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో చాలా చార్ట్ బస్టర్ పాటలను ప్రేక్షకులకు అందించిన తమన్ తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషీయుం" అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఒరిజినల్ మలయాళం వర్షన్ కి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ కోసం తమ ఒరిజినల్ నుంచి కొన్ని ట్యూన్స్ ను కాపీ చేయడంతో అది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

జేక్స్ బిజాయ్ అందించిన కొన్ని ట్యూన్స్ ని కాపీ చేసి భీమ్లా నాయక్ సినిమాలో వాడారు కానీ జేక్స్ బిజాయ్ కి క్రెడిట్ ను ఇవ్వలేదు. దీంతో తన ట్యూన్స్ వాడుతున్నప్పటికీ తనకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్ (ఐ పి ఆర్ ఎస్) లో కాపీ రైట్స్ ఇష్యూ వేశారు. మరి ఈ విషయంలో థమన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు "భీమ్లా నాయక్" సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story