SS Thaman: "భీమ్లా నాయక్" సినిమాతో నాలుగవ వేవ్ వస్తుంది అంటున్న థమన్

SS Thaman: థియేటర్ ఓనర్ లు జాగ్రత్త అంటున్న థమన్

admin1
Updated on: 10 Feb 2022 7:01 PM IST
SS Thaman Says that the Fourth wave will Come With the Bheemla Nayak Movie
X

"భీమ్లా నాయక్" సినిమాతో నాలుగవ వేవ్ వస్తుంది అంటున్న థమన్ 

SS Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ "భీమ్లా నాయక్" నాలుగు వేవ్ ని తీసుకొస్తుంది అంటూ థమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా భీమ్లా నాయక్ విడుదల సమయంలో థియేటర్ ఓనర్లు జాగ్రత్తగా ఉండాలని ఆడియన్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పుకొచ్చారు థమన్.

తమన్ అందించిన సంగీతం విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే ఈ సినిమాతో థమన్ మరొక చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందుకునే లాగా కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతోంది. నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మురళి శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

admin1

admin1

Next Story