SS Thaman: ప్రభాస్ తర్వాతే పవన్ కళ్యాణ్ అంటున్న థమన్

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులలో ఎస్.ఎస్.తమన్ పేరు ముందే ఉంటుంది...

admin1
Updated on: 4 Jan 2022 2:30 PM IST
SS Thaman Put Aside Pawan Kalyan Bheemla Nayak Movie for Prabhas Radhe Shyam Movie | Tollywood News
X

SS Thaman: ప్రభాస్ తర్వాతే పవన్ కళ్యాణ్ అంటున్న థమన్

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సంగీత దర్శకులలో ఎస్.ఎస్.తమన్ పేరు ముందే ఉంటుంది. దాదాపు స్టార్ హీరోలతో సినిమాలు అన్నిటికీ సంగీతం అందిస్తుంది తమనే. అయితే ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "రాధే శ్యామ్" సినిమాకి ఆఖరి నిమిషంలో నేపధ్యసంగీతం అందించడానికి రంగంలోకి దిగాడు థమన్.

అయితే "భీమ్లా నాయక్" సినిమాకి సంగీతం సంక్రాంతికి ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు థమన్.. కానీ తాజా సమాచారం ప్రకారం "రాధే శ్యామ్" సినిమా వల్ల "భీమ్లా నాయక్" సినిమాకి ఇవ్వాల్సిన సంగీతం ఆలస్యమవుతోందట. ప్రస్తుతం థమన్ "రాధే శ్యామ్" రీ రికార్డింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. దీంతో కొన్ని రోజుల పాటు భీమ్లా నాయక్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.

పాచ్ వర్క్ మొత్తం పూర్తి అయినప్పటికీ సినిమా సంక్రాంతికి రెడీ అయ్యే అవకాశం లేదు. ఇక అనుకున్న సమయానికి భీమ్లా నాయక్ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు "రాధే శ్యామ్" సినిమా జనవరి 14న విడుదల అవ్వాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే "ఆర్ఆర్ఆర్" సినిమా లాగానే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story