SS Thaman: వంద కోట్ల బడ్జెట్ కే తమన్..?

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.తమన్ పేరు ముందే ఉంటుంది.

Arun Chilukuri
Published on: 22 April 2022 6:20 PM IST
SS Thaman Not Working for Small Projects
X

SS Thaman: వంద కోట్ల బడ్జెట్ కే తమన్..?

SS Thaman: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.తమన్ పేరు ముందే ఉంటుంది. వరుసగా స్టార్ హీరోల ప్యాన్ ఇండియన్ సినిమాలకి సంగీతాన్ని అందిస్తూ చార్ట్ బస్టర్ లతో కేరియర్లో ముందుకు దూసుకుపోతున్న ఎస్.ఎస్.తమన్ చేతిలో ఇంకా చాలానే భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని అపజయాలు వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో తమన్ పేరు ఒక బ్రాండ్ లాగానే మారిపోయింది. తమన్ సంగీతాన్ని చేకూర్చిన దాదాపు ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆఖరికి డిజాస్టర్ గా మారిన "రాధే శ్యామ్" సినిమాలో కూడా తమన్ నేపథ్య సంగీతం అద్భుతం అని అభిమానులు కొనియాడారు.

అయితే తాజా సమాచారం ప్రకారం తమన్ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం వంద కోట్ల బడ్జెట్ లో మ్యూజిక్ చేయనని నిర్మొహమాటంగా తమన్ చెప్పేస్తున్నారు. ఇంతకుముందు వరకు మీడియం రేంజ్ మరియు చిన్న సినిమాలకు కూడా పని చేసిన తమన్ ఇప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఏ సంగీత దర్శకుడైన తనకి ఎంత రెమ్యూనరేషన్ కావాలో చెప్పాలి కానీ పెద్ద బడ్జెట్ సినిమా అయితేనే చేస్తానని చెప్పే సందర్భాలు చాలా తక్కువ. మరి తమన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇకపై చిన్న సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story