SS Thaman: అఖిల్ సినిమా నుంచి తప్పుకున్న థమన్

SS Thaman Leave From Akhils Most Eligible Bachelor Movie
x

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ (ఫైల్ ఇమేజ్)

Highlights

SS Thaman: స్టార్ హీరోల కోసం యువ హీరో సినిమా నుంచి తప్పుకున్న థమన్

SS Thaman: ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "ఏజెంట్" అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించడానికి ఎస్.ఎస్.తమన్ ను రంగంలోకి దింపారు దర్శకనిర్మాతలు. కానీ తాజా సమాచారం ప్రకారం థమన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నరట.

#ఆర్సి15, గాడ్ఫాదర్, మహేష్ బాబు28 వంటి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న థమన్ "ఏజెంట్" సినిమా కోసం సమయాన్ని కేటాయించి లేక పోతున్నారట. అందుకనే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలతో చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో థమన్ బదులుగా హిప్ హాప్ తమిజా ను సినిమాకి సంగీతాన్ని అందించడానికి తీసుకున్నారు దర్శక నిర్మాతలు."ధ్రువ" సినిమా తరువాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి తమీజా సంగీతాన్ని అందించడం ఇది రెండవ సారి. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories