SS Thaman: సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం రంగంలోకి దిగిన థమన్

SS Thaman: చిన్న సినిమాకి నేపథ్య సంగీతం అందించడానికి రెడీ అయిన థమన్

admin1
Updated on: 5 Jan 2022 9:01 PM IST
SS Thaman is the Music Director for Siddu Jonnalagadda Movie DJ Tillu
X

సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం రంగంలోకి దిగిన థమన్

SS Thaman: "జోష్" సినిమాతో నటుడిగా మారిన సిద్దు జొన్నలగడ్డ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో "లైఫ్ బిఫోర్ వెడ్డింగ్" అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత "కృష్ణ అండ్ హిజ్ లీల", "మా వింత గాధ వినుమా" అనే సినిమా లతో అందరి దృష్టిని ఆకర్షించిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు "డీజే టిల్లు" అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఎస్.ఎస్.తమన్ అందించనున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story