తమన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న "వారసుడు" బృందం

SS Thaman: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 7 Jan 2023 7:00 PM IST
SS Thaman is the Main Reason for Vijay’s Varisu Release Issues
X

తమన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న "వారసుడు" బృందం

SS Thaman: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో తమన్ సంగీతాన్ని అందించిన రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా నే విడుదల కి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి తమిళ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "వారసుడు" కాగా మరొకటి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "వీర సింహారెడ్డి". గత కొంతకాలంగా వారసుడు సినిమా విడుదల తేదీకి సంబంధించిన కన్ఫ్యూజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

అజిత్ హీరోగా నటించిన "తునివు" సినిమా కూడా విడుదల కాబోతుండడంతో వారసుడు బృందం సినిమా విడుదలను ప్రీ ఫోన్ చేసుకుంది కానీ విడుదల తేదీని సడన్గా మార్చడంతో ప్రెజర్ మొత్తం ఇప్పుడు తమన్ పై పడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి తమన్ సినిమాకి సంబంధించిన పెండింగ్ పనిని ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే చిత్ర బృందం సినిమా తమిళ్ వర్షన్ ని జనవరి 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది మరోవైపు తెలుగు వర్షన్ ని జనవరి 14కి వాయిదా వేశారు విడుదల కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది కానీ ఇంకా కంటెంట్ మాత్రం డెలివరీ అవ్వలేదు.

ఈ విషయంలో ఓవర్సీస్ బయ్యర్లు కూడా కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ రిసీవ్ అవ్వకుండా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బుకింగ్స్ తీసుకోగలరు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు సినిమా విషయంలో ఇలా జరగటం ప్రేక్షకులకు కూడా కొంత షాకింగ్ గానే ఉంది. మరోవైపు తమన్ చేతిలో చాలా సినిమాలో ఉండటంతో తను బిజీ అయిపోయి అనుకున్న సమయానికి సంగీతాన్ని అందించలేకపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story