"గాడ్ ఫాదర్" సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్

"గాడ్ ఫాదర్" సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్

Arun Chilukuri
Published on: 14 Oct 2022 4:45 PM IST
SS Thaman Hints Sequel of God Father Movie
X

"గాడ్ ఫాదర్" సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్

God Father: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. సత్యదేవ్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించగా, నయనతార, సునీల్, సల్మాన్ ఖాన్, మురళీ శర్మ, బిగ్బాస్ దివి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతోందని సినిమాకి సంగీతం అందించిన ఎస్ ఎస్ తమన్ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

"#గాడ్‌ఫాదర్‌కి సంబంధించిన నా పనులన్నీ పూర్తి చేసిన నా మాతృ భూమి చెన్నై కి నా ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. హైదరాబాద్ లో దాదాపు 2 సంవత్సరాల క్రితం తమిళ దర్శకుడిగా అడుగుపెట్టాను. ఇప్పుడు ప్రజలు గుర్తించడంతో చాలా సంతృప్తి గా బయలుదేరుతున్నాను. తెలుగు వారికి నా ధన్యవాదాలు. త్వరలో తిరిగి వస్తాను," అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ట్వీట్ చేయగా, దానికి తమన్, "#ఖురేషి రిటర్న్స్. అది అవ్వబోయే నెక్స్ట్ యాక్టర్ ఎవరో నీకు తెలుసు కదా. అది అతి త్వరలో చేయండి మోహన్ రాజా," అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా ఇండైరెక్ట్ గా సినిమాలో చిరంజీవి పాత్ర పేరైన "ఖురేషి" రిటర్న్స్ అంటూ సినిమా కి సీక్వెల్ "గాడ్ ఫాదర్ 2" ఉంటుందని హింట్ ఇచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story