SS Thaman: నానికి కౌంటర్లు వేసిన తమన్

SS Thaman: తమన్ ట్వీట్ నాని చేసిన వివాదాస్పద స్టేట్మెంట్లు గురించేనా?

admin1
Updated on: 31 Dec 2021 3:00 PM IST
SS Thaman Gives Strong Counter Nani on Twitter | Tollywood News
X

తమన్ ట్వీట్ నాని చేసిన వివాదాస్పద స్టేట్మెంట్లు గురించేనా?

SS Thaman: ఈ మధ్య కాలంలో తన ఆసక్తికరమైన స్టేట్ మెంట్ లతో ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ మధ్యనే "శ్యామ్ సింగరాయి" ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరి కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. "టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీసింగిల్ గా సినిమాని డామినేట్ చేయకూడదు అంటూ నాని చెప్పుకొచ్చారు. ఒకవేళ సినిమాలో కేవలం సంగీతం మాత్రమే బావుంది, లేక సినిమాటోగ్రాఫర్ విజువల్స్ మాత్రమే బాగున్నాయి, నటీ నటులు మాత్రమే బాగున్నారు అని అంటే ఆ సినిమాలో ఏదో లోపం ఉందని. సినిమా అనేది ఎప్పుడూ వన్ మాన్ షో కాకూడదు" అంటూ నాని కామెంట్లు చేశారు.

తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ నాని పేరు చెప్పకుండానే అతనికి కామెంట్లకి కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా "సినిమాలోని అన్ని క్రాఫ్ట్ లు కలిపితేనే సినిమా అవుతుంది. అందులో డామినేట్ చేసే క్రాఫ్ట్స్ ఏమీ ఉండవు. గొప్ప విజువల్స్, మంచి క్యారెక్టర్ లు, స్క్రిప్ట్, ఎమోషన్స్ అన్నీ కలిపితేనే సినిమా. సినిమా ఎప్పటికీ వన్ మాన్ షో అవ్వదు. మాకు సినిమా అంటే ప్రేమ. సినిమా కోసం చచ్చిపోతాం," అంటూ తమన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

admin1

admin1

Next Story