SS Thaman: డైరెక్టర్ నే మర్చిపోయిన థమన్

SS Thaman Forget the Bheemla Nayak Movie Director
x
భీమ్లా నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ ను మర్చిపోయిన థమన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

SS Thaman: ఈ మధ్య స్టార్ డైరెక్టర్ లందరికీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ మొదటి ఆప్షన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే

SS Thaman: ఈ మధ్య స్టార్ డైరెక్టర్ లందరికీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ మొదటి ఆప్షన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోలెడు హై బడ్జెట్ సినిమా ల తో బిజీగా ఉన్న థమన్ తదుపరి సినిమా బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో నటించిన "అఖండ". ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూ అంటేనే తన చేతుల్లో ఉన్న మిగతా ప్రాజెక్టుల గురించి కూడా ప్రశ్నలు రాకమానవు. ఈ నేపథ్యంలోనే థమన్ కి పవన్ కళ్యాణ్ మరియు రానా హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమా గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇస్తాను అని చెబుతున్నారు థమన్. కొంతవరకు పర్లేదు కానీ అసలు ఈ సినిమాకి దర్శకుడు ఉన్నారని పూర్తిగా థమన్ మర్చిపోయినట్లు గా అనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం ఈ సినిమాకి స్క్రిప్ట్ మాత్రమే అందిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నది డైరెక్టర్ సాగర్ కే చంద్ర. అలాంటిది డైరెక్టర్ గురించి మాట్లాడకపోవడం నిజంగానే పెద్ద విషయం. మరి తర్వాత రోజుల్లో థమన్ ఈ కామెంట్ల మీద క్లారిటీ ఇస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories