Thaman: థమన్ మ్యూజిక్ అక్కడినుంచి కాపీ చేశాడా?

Thaman: థమన్ మ్యూజిక్ అక్కడినుంచి కాపీ చేశాడా?

admin1
Updated on: 1 March 2022 9:01 PM IST
SS Thaman Copy the Music from There
X

థమన్ మ్యూజిక్ అక్కడినుంచి కాపీ చేశాడా?

Thaman: ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ పేరు బాగానే వినిపిస్తోంది. పట్టిందల్లా బంగారం అయినట్టు థమన్ కొట్టిన ప్రతి పాట చార్ట్ బస్టర్ గా మారుతుంది. ఈ మధ్యనే అఖండ సినిమాతో అదరగొట్టిన థమన్ తాజాగా విడుదలైన "భీమ్లా నాయక్" తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. పాటల కంటే కూడా థమన్ ఇస్తున్న నేపథ్యసంగీతం సినిమాకి ఆయువుపట్టుగా మారుతోంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అంటే దాంట్లో కూడా థమన్ పార్ట్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా తమన్ సంగీతం గురించి ఒక పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

"భీమ్లా నాయక్" సినిమాలో పవన్ కళ్యాణ్ రానా ని కలవడానికి రానా ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చిన మ్యూజిక్ థమన్ కాపీ పేస్ట్ చేశాడు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక ఇంగ్లీష్ పాట ని షేర్ చేస్తూ థమన్ అందించిన సంగీతం ఈ పాట నుంచి కాపీ చేశాడని వేలెత్తి చూపిస్తున్నరు. ఏదేమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మ్యూజిక్ కూడా చాలా బాగా ఉండడంతో కేవలం ఒక చిన్న బిట్ కాపీ చేశాడు అనే పుకారు ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్, రానా లు హీరోలుగా నటించిన ఈ సినిమా లో నిత్యమీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటించారు.

admin1

admin1

Next Story