SS Thaman: మరో బడా ప్రాజెక్టుని లైన్లో పెట్టిన థమన్

* దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు * ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

admin1
Updated on: 30 Sept 2021 4:45 PM IST
S. Thaman Providing Music for Thalapathy Vijay New Movie
X

థమన్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

SS Thaman: ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకులలో తమన్ పేరు ముందే ఉంటుంది. వరుస సూపర్ హిట్ సినిమాలని అందుకున్న థమన్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే "అఖండ", "సర్కారు వారి పాట", "గని", "థాంక్యూ", "భీమ్లా నాయక్", "గాడ్ ఫాదర్" వంటి స్టార్ హీరోల సినిమాలకి సంగీతాన్ని అందిస్తున్న థమన్ ఇప్పుడు మరొక సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశాన్ని పొందారు. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించేందుకు తమన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. అద్భుతమైన సంగీతాన్ని అందించడం మాత్రమే కాకుండా తమన్ బడ్జెట్ పరంగా కూడా అందుబాటులో ఉంటాడని, వేగంగా పని చేస్తారని దర్శకనిర్మాతలు ఈ మధ్య థమన్ ని మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో థమన్ మ్యాజిక్ చేస్తాడో తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడడనున్నాయి.

admin1

admin1

Next Story