హీరోయిన్ల పై క్లారిటీ ఇవ్వనున్న జక్కన్న

హీరోయిన్ల పై క్లారిటీ ఇవ్వనున్న జక్కన్న
x
Highlights

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బోలెడు...

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బోలెడు వార్తలు బయటకి వస్తున్నాయి కానీ రాజమౌళి అండ్ టీం నుండి ఒక్కరు కూడా స్పందించడం లేదు. అయితే ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా పై వచ్చిన పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నెల 14న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో 'ఆర్ఆర్ఆర్' పైన ఉన్న అన్ని పుకార్లకు ఓకే సారి క్లారిటీ ఇవ్వనున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు కానీ రాజమౌళి ఈ నెల 14వ తేదీన ఖచ్చితంగా మీడియాతో మాట్లాడనున్నారు అని వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఆలియా భట్ మరియు పరిణీతి చోప్రా లు హీరోయిన్లుగా నటించనున్నారు అని పుకార్లు బయటకు వచ్చాయి. వీటిపై రాజమౌళి ఈ ప్రెస్ మీట్ లో స్పందించాల్సి ఉంది. అంతేకాక కోల్కతా షెడ్యూల్లో ఇప్పటిదాకా జరిగిన సినిమా ప్రోగ్రెస్ మరియు కథను ఎలా ఉండబోతోంది అనే విషయాలపై కూడా రాజమౌళి చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మరికొందరు మాత్రం రాజమౌళి హీరోయిన్ల విషయంలో మరో రెండు వారాల్లో అధికారిక ప్రకటన ఇస్తామని చెప్పి ఆ ప్రశ్నను దాటేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories