SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..

SS Rajamouli Sensational Comments On Anil Ravipudi
x

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..

Highlights

SS Rajamouli: హీరో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ.

SS Rajamouli: హీరో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్‌ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి సినిమా గురించి మాట్లాడిన తర్వాత.. ఈ ఈవెంట్ కి కొరటాల శివ గారు, రాజమౌళి గారు వచ్చారు కాబట్టి కొరటాల శివ గారు దేవర అప్డేట్ ఇవ్వాలి. రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా కనీసం ఓపెనింగ్ ఎప్పుడో చెప్పాలి అని అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో ప్రజెంటర్‌గా పరిచయమవుతున్న కొరటాల శివకు శుభాకాంక్షలు. మాములుగా ‘కృష్ణమ్మ’ అంటే అందరూ నార్మల్‌గా తీసుకుంటారు. అదే కొరటాల శివ ప్రజెంట్స్ ‘కృష్ణమ్మ’ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి మీరు (కొరటాల శివ) ప్రజెంటర్‌గా చేస్తున్న ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకోవాలి అనుకుంటున్నారు. హీరో సత్య అండ్ మొత్తం మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’ అని చెప్తూ.. ‘ఎవరైనా సరే ఓ కెమెరా పట్టుకుని వెనకాలే నడుస్తూ ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగు వేసి గుద్దేస్తే వాళ్లకు రూ. 10 వేలు ఇస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది విని షాకైన అనిల్‌ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్‌మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్‌లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories