SS Rajamouli: "నా కెరీర్లో ఇదే బెస్ట్ షాట్" అంటున్న రాజమౌళి

SS Rajamouli: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రో ఇలానే ఉంటుంది అంటున్న రాజమౌళి

admin1
Published on: 20 Dec 2021 6:26 PM IST
SS Rajamouli Said about Best Shot in RRR Movie Trailer
X

ఎస్ ఎస్ రాజమౌళి(ఫైల్-ఫోటో) 

SS Rajamouli: భారీ అంచనాల మధ్య "ఆర్ ఆర్ ఆర్" సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇంట్రో సీన్లు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్ ఒక పులి లా అడవిలో పరిగెత్తే సన్నివేశాన్ని ఇప్పటికే ట్రైలర్లో చూసాము. అదే ఎన్టీఆర్ ఇంట్రో సన్నివేశమట.

"ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్ చెప్పుల్లేకుండా ఒక పులి లాగా బల్గేరియా అడవుల్లో పరిగెత్తారు. ఇక రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కోసం అతన్ని 2000 మంది మధ్యలోకి తోయాల్సి వచ్చింది. చెమట, దుమ్ము, రక్తం మధ్య రామ్ చరణ్ వస్తూ ఉంటారు. నేను తీసిన బెస్ట్ షాట్స్ లో ఇది కూడా ఒకటి" అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన "నాటు నాటు", మరియు "జననీ" పాటలు చార్ట్ బస్టర్లు మారిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story