SS Rajamouli: ఆ సినిమాకి రెండవ పార్ట్ తీయనున్న రాజమౌళి

RRR Movie: అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

admin1
Updated on: 1 Feb 2022 6:17 PM IST
SS Rajamouli RRR Movie To Get A Sequel?
X

SS Rajamouli: ఆ సినిమాకి రెండవ పార్ట్ తీయనున్న రాజమౌళి

RRR Movie: అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం మార్చి 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆలియా భట్ మరియు ఓలివియా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

తాజా సమాచారం ప్రకారం విజయేంద్రప్రసాద్ ఇప్పటికే "ఆర్.ఆర్.ఆర్" కోసం కథని రాయటం మొదలు పెట్టారట ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనుకున్న స్థాయి లోనే బ్లాక్ బస్టర్ అయితే రాజమౌళి కచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి కూడా రెడీ అని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మూడేళ్ల పాటు మరే సినిమా చేయకుండా కేవలం ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. మరి సీక్వెల్ కోసం మరొక రెండు మూడేళ్లు ఈ ఇద్దరు స్టార్ హీరోలు మరో రెండు మూడేళ్ల పాటు రాజమౌళికి ఇవ్వగలరా అని అభిమానులు సైతం ఆలోచనలో పడుతున్నారు.


admin1

admin1

Next Story