RRR Teaser: అదిరిపోయిన "ఆర్ఆర్ఆర్" గ్లింప్స్

SS Rajamouli RRR Teaser out Today 01st November 2021 | RRR Movie Release Date
x

RRR Teaser out

Highlights

RRR Glimpse: ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ఆర్ఆర్" (రౌద్రం రణం రుధిరం)...

RRR Glimpse: ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ఆర్ఆర్" (రౌద్రం రణం రుధిరం) చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇపుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ లో నిలిచింది. దాదాపుగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు.

తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టి "ఆర్ఆర్ఆర్" అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఈ గ్లింప్స్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించగా అజయ్ దేవగన్, అలియా భట్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుకుంటున్న "ఆర్ఆర్ఆర్" చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7 2022 న విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories