RRR Movie - SS Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" టైటిల్ వెనుక రహస్యం చెప్పిన రాజమౌళి

RRR Movie - SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టైటిల్ ని ఎందుకు మార్చలేదు అనే విషయంపై రాజమౌళి రియాక్ట్ అయ్యారు.

admin1
Updated on: 1 Jan 2022 2:00 PM IST
SS Rajamouli Revealed the Secret Behind RRR Movie Name | RRR Movie Postponed | Tollywood News
X

RRR Movie - SS Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" టైటిల్ వెనుక రహస్యం చెప్పిన రాజమౌళి

RRR Movie - SS Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ టైటిల్ ని ఎందుకు మార్చలేదు అనే విషయంపై రాజమౌళి రియాక్ట్ అయ్యారు. సినిమా మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సినిమా ఆర్ఆర్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తోనే ట్రెండ్ అయిందని, ఆ పేరు ప్రేక్షకులలో బాగా పాపులర్ అయిపోయింది అని, అందుకే దాన్ని మార్చకుండా దానికి అబ్రివేషన్ పెట్టి, ఆర్ఆర్ఆర్ ను "రౌద్రం రణం రుధిరం" గా మార్చమని తెలియజేశారు రాజమౌళి. డీ వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story