బాహుబలి-3 పై రాజమౌళి అదిరిపోయే అప్‌డేట్‌

SS Rajamouli Revealed Crazy Update on Bahubali 3
x

బాహుబలి-3 పై రాజమౌళి అదిరిపోయే అప్‌డేట్‌

Highlights

Bahubali-3: హాలీవుడ్ రేంజ్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్న రాజమౌళి తన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలికి మరో సీక్వెల్ తీసుకొస్తున్నారు.

Bahubali-3: హాలీవుడ్ రేంజ్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్న రాజమౌళి తన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలికి మరో సీక్వెల్ తీసుకొస్తున్నారు. బాహుబలి అద్భుతమైన రీతిలో సక్సెస్ అయ్యాక దానికి సీక్వెల్ గా బాహుబలి 2 తీసుకొచ్చి సూపర్ సక్సెస్ కొట్టారు. దానికి సీక్వెల్ గా బాహుబలి 3 కి సన్నాహాలు చేస్తున్నట్టు రాజమౌళి కన్ఫామ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాన్ని రాజమౌళి కన్ఫామ్ చేశారు.

బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు బాహుబలి 3 లో చూపించబోతున్నామన్నారు. దానికి సంబంధించిన వర్క్‌ జరుగుతోందని, నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖ వ్యక్తం చేశారని రాజమౌళి చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కొంచెం సమయం పట్టొచ్చని, అయితే బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త వస్తుందని రాజమౌళి చెప్పారు. రాజమౌళి నుంచి ఈ కబురు వెలువడిందో లేదో వెయిటింగ్‌ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories