"ఆర్ఆర్ఆర్" లో ఆ పాట ఉంటే బావుండేది అంటున్న ఫ్యాన్స్..

"ఆర్ఆర్ఆర్" లో ఆ పాట ఉంటే బావుండేది అంటున్న ఫ్యాన్స్..

Arun Chilukuri
Published on: 4 March 2023 11:46 AM IST
SS Rajamouli Removed Duet Song From RRR Movie
X

"ఆర్ఆర్ఆర్" లో ఆ పాట ఉంటే బావుండేది అంటున్న ఫ్యాన్స్..

RRR Movie: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆలియా భట్ ఈ మధ్యనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించిన అలియా భట్ కి సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమి దక్కలేదు. అయితే రామ్ చరణ్ మరియు ఆలియా భట్ మధ్య కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు కానీ అవి సినిమాలో యాడ్ చేయలేదని కొందరు చెబుతున్నారు.

అంతేకాకుండా రామ్ చరణ్ మరియు ఆలియాభట్ల మధ్య ఒక డ్యూయెట్ కూడా ఉంటుందట. దీని గురించి ఆలియా భట్ కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. కానీ సినిమాలో మాత్రం వీరిద్దరి మధ్య ఎలాంటి పాట లేదు. తాజాగా ఇప్పుడు అభిమానులు అలియాభట్ మరియు రామ్ చరణ్ ల మధ్య ఉండే పాట కూడా సినిమాలో ఉండుంటే చాలా బాగుండేదని చెబుతున్నారు.

ఒకవైపు సినిమా రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా పాటలకి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకొని ఆస్కార్‌కి కూడా నామినేట్ అయింది. ఈ నేపథ్యంలోనే సినిమాలో రామ్ చరణ్ మరియు ఆలియా భట్‌ల మధ్య ఒక అందమైన డ్యూయెట్ కూడా ఉండి ఉంటే దానికి కూడా అంతే ఆదరణ లభించి ఉండేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి కనీసం పాటనైనా చిత్ర బృందం విడుదల చేస్తుందో లేదో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story